గ్రూప్స్‌లో కొత్త పోస్టులు…

182
- Advertisement -

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం 90వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కాగా ఇందులో ఇప్పటికే 50వేల పోస్టులను భర్తీ చేసింది. తాజాగా గ్రూప్‌ పోస్టులల్లో మరో కొత్తగా ఉద్యోగ వివరాలు నమోదు చేశారు. దీంతో గ్రూప్‌-2లో కొత్తగా ఆరు రకాల పోస్టులు, గ్రూప్-3లో రెండు రకాల పోస్టులు, గ్రూప్-4లో నాలుగు రకాల పోస్టులను కలిపింది. దీంతో త్వరలోనే గ్రూప్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపింది.

గ్రూప్-2లో చేర్చిన పోస్టులు
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సర్వీస్‌)
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఇతర శాఖలకు సంబంధించి)
జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్
అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్
అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్
అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్

గ్రూప్-3లో
గిరిజ సంక్షేమ శాఖ అకౌంటెంట్
సీనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్ లేదా హెచ్‌ఓడీల్లో ఇదే విధమైన పోస్టులు

గ్రూప్-4లో
జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్
జువైనల్ సర్వీసెస్ సూపర్‌వైజర్ (మేల్) (జువైనల్ సర్వీసెస్, డబ్య్లూసీడీ అండ్ ఎస్సీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్)
మ్యాట్రన్ కమ్ స్టోర్ కీపర్
మ్యాట్రన్ (కమిషన్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్)

ఇవి కూడా చదవండి…

ఏపీలో పీఠాధిపతుల కొత్త పార్టీ?

ప్చ్.. అసలు ఇంతలాస్యం ఎందుకు కొరటాలా ?

బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు..

- Advertisement -