మెస్మరైజింగ్ లుక్‌లో మహేష్‌..

194
mahesh
- Advertisement -

సూపర్‌ స్టార్ మహేష్‌ లాక్‌ డౌన్‌ తర్వాత ఓ కమర్షియల్ యాడ్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ షూటింగ్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. రెండు మూడు రోజుల్లో ఈ యాడ్ షూటింగ్ పూర్తి కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ లుక్ బయటికి వచ్చింది. ఇందులో మహేష్‌ లుక్‌ మెస్మరైజింగ్‌గా ఉంది. ఇప్పుడు మహేష్‌ అభిమానులు కూడా ఇదే అంటున్నారు. రోజుకో ఫోటో అప్‌లోడ్ చేస్తుంటే అందులో మరింత యంగ్ అయిపోతున్నాడు సూపర్ స్టార్ అని.

అంతేకాదు రోజురోజుకీ మరింత కుర్రాడైపోతున్నాడు సూపర్ స్టార్ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంటున్నాడు మహేష్‌. ఈయన త్వరలోనే పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చేలా ఉంది.

- Advertisement -