‘స‌ర్కార్’ కు మ‌ద్ద‌తుగా ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్..

246
kamal hasan, rajinikanth
- Advertisement -

స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్. మురుగ‌దాస్ ద‌ళ‌ప‌తి విజ‌య్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన మూవీ స‌ర్కార్. విడుద‌లైన మూడు రోజుల్లోనే 150కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసింది. ప్ర‌స్తుతం సర్కార్‌కీ, తమిళనాడు సర్కార్‌కీ మధ్య వార్ జరుగుతుంది. సినిమాలో దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత పై కొన్ని అస‌భ్య స‌న్నివేశాలు చిత్రిక‌రించార‌ని త‌మిళ‌నాడులో ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. సినిమాలోని వివాదాస్పద సీన్లు, డైలాగులు తొలగించాలని అన్నాడీఎంకే కార్యకర్తలు థియేటర్ల ముందు ధర్నాలు చేసారు.

sarkar

దీంతో ప్ర‌భుత్వం ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ ను అర్ధరాత్రి అరెస్ట్ చేసినట్టు వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా స‌ర్కార్ సినిమా వివాదంపై స్పందించారు మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ మద్దతుగా నిలిచారు. ‘సెన్సార్ బోర్డు ఓసారి ఆమోదం తెలిపిన సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించడం దారుణం.

sarkar fight

థియేటర్ల ముందు ధర్నాకు దిగడం, సినిమా పోస్టర్లను చించివేయడం.. ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదు. ఈ ఘటనలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. ఇంత‌టితో ఈవివాదానికి ముగింపు ప‌లికారు నిర్మాత‌లు. సినిమాలో అభ్యంతరకరంగా ఉన్న సన్నివేశాలను తొలగించేందుకు సన్ పిక్చర్స్ అంగీకరించిందని వార్త‌లు వ‌స్తున్నాయి.

- Advertisement -