సుకుమార్ కు షాక్.. ఆల్ ది బెస్ట్ చెప్పిన మహేశ్ బాబు

325
Sukumar-mahesh babu
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు భరత్ అనే నేను బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ దశలో ఉంది. ఎప్రిల్ లో ఈమూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఇక ఇన్ని రోజులు మహేశ్ తర్వాత మూవీ సుకుమార్ తో చేయనున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆవార్తలకు బ్రేక్ వేశారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కొన్ని సృజనాత్మక అంశాల్లో విభేదాలు రావడం వల్ల సుకుమార్ తో సినిమా చేయడం లేదంటూ ట్వీట్ చేశారు మహేశ్.

Sukumar-mahesh babu

అలాగే సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో అర్య3 చిత్రం పట్టాలెక్కనుందని చెప్పారు సూపర్ స్టార్. మహా శివరాత్రి సందర్భంగా ఆర్య 3 మూవీ అఫిషియల్గా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు మహేశ్ బాబు. కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన సుకుమార్ కు అంతా మంచే జరగాలని కొరకుంటున్నాని తెలిపారు.

సుకుమార్ ఓ అద్భుతమైన ఫిలిం మేకర్ అని కొనియాడారు. 1నేనొక్కడినే మూవీ ఎప్పటికీ ఓ కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోతుందని, ఆ సినిమాకు పనిచేసిన సమయంలో ప్రతిక్షణం ఎంజాయ్ చేసినట్టు తెలిపాడు. అల్లు అర్జున్ సుకుమార్ మూవీ ఓకే కావడంతో మరి త్రివిక్రమ్ అల్లు అర్జున్ మూవీ ఉంటుందా లేదా అన్నది టాలీవుడ్ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది.

- Advertisement -