పూర్ణ‌గా నాగ‌చైత‌న్య‌, శ్రావ‌ణిగా స‌మంత..’మజిలీ’

235
majili

అక్కినేని నాగ‌చైత‌న్య‌, హీరోయిన్ సమంత పెళ్లి త‌ర్వాత జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `మ‌జిలీ`. శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స‌మంత‌తో పాటు దివ్యాంశిక కౌశిక్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ మూవీలో నాగచైతన్య గెటప్ ఆసక్తికరంగా ఉంటుందట. రెండు విభిన్న గెటప్‌లలో ఆకట్టుకుంటాడని తెలుస్తోంది.

అటు యువకుడిగా, మధ్య వయస్కుడిగా రెండు పాత్రలో చైతూ కనిపించనున్నాడని సమాచారం. చాలా విధేయత కలిగిన భార్యగా సమంత నటన ఆకట్టుకుంటుందని ఇటివలే ట్వీట్ చేశారు దర్శకుడు శివ నిర్వాణ. ఈమూవీలో సమంత అద్భుతంగా నటించిందని తెలిపారు. ఈచిత్రంలో పూర్ణ అనే పాత్రలో నాగ చైతన్య , శ్రావణి అనే పాత్రలో సమంత కనిపించనున్నారట. పూర్తిగా అండ్ యాక్షన్ గా తెరకెక్కుతున్న ఈమూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈమూవీకి గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎప్రిల్ 5న ఈచిత్రాన్ని విడుదల చేయనున్నారు.