‘మ‌హ‌ర్షి’ విలేజ్ సెట్ కోసం రూ.8కోట్లు..

338
maharshi
- Advertisement -

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం న‌టిస్తోన్న సినిమా మ‌హ‌ర్షి. ఈసినిమాకు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ప్ర‌ముఖ నిర్మాత‌లు దిల్ రాజు, అశ్వినిద‌త్ లు నిర్మిస్తున్నారు. మ‌హేశ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా పూజా హెగ్డె న‌టిస్తోంది. హీరో అల్ల‌రి న‌రేష్ ఈమూవీలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. తాజాగా ఈమూవీ షూటింగ్ హైద‌రాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జ‌రుగుతుంది. ఈసంద‌ర్భంగా రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన విలేజ్ సెట్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను దర్శకుడు వంశీ పైడిపల్లి చిత్రీకరిస్తున్నారు.

mahesh babu

ఈ సెట్ కి ఏకంగా 8కోట్లు ఖ‌ర్చు పెట్టారంట‌. అయితే మొద‌ట ఏపీలోకి కొన్ని గ్రామాల్లో షూట్ చేద్దామ‌నుకున్నా..మ‌హేశ్ బాబు అభిమానులను దృష్టిలో ఉంచుకుని షూటింగ్ కు అంత‌రాయం క‌లుగుతుంద‌ని భావించి రామోజీ ఫిలిం సిటీలో చిత్ర‌క‌రిస్తున్నారు. ఈసినిమాలో మ‌హేశ్ బాబు రైతుగా క‌నిపించ‌నున్నారు. వ‌చ్చే వేస‌విలో ఈమూవీని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు చిత్ర నిర్మాత‌లు.

- Advertisement -