విజయనిర్మల మృతి.. మహర్షి 50రోజుల వేడుక వాయిదా

319
Maharshi

సూపర్ స్టార్ మహేశ్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ మహర్షి. మహేశ్ కెరీర్ లోనే భారీ విజమం సాధించిన ఈచిత్రం రేపటితో 50రోజులు పూర్తి చేసుకోనుంది. ఈసందర్భంగా మహర్షి 50రోజుల ఫంక్షన్ ను చాలా గ్రాండ్ గా సెలబ్రెట్ చేద్దామని అనుకున్నారు చిత్ర నిర్మాతలు. ఈ మేరకు ఈ నెల 28న వేదికగా శిల్పా కళా వేదికను కూడా ఖరారు చేశారు.

అయితే సూపర్ స్టార్ కృష్ణ భార్య నటీ, దర్శకురాలు విజయనిర్మల మరణించడంతో ఈఫంక్షన్ వాయిదా వేసినట్లు తెలిపారు నిర్మాతలు. తిరిగి ఆ కార్యక్రమం ఎప్పుడుంటుందన్న విషయాన్ని వారు ఇంకా ప్రకటించలేదు. విజయనిర్మల మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నారు.