టీటీడీ బోర్డు మెంబర్‌గా అక్కినేని హీరో..!

430
ap cm

పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న ఏపీ సీఎం జగన్‌ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుసాగుతున్నారు. తాజాగా ఎన్నికలకు ముందు వైసీపీకి మద్దతిచ్చిన అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి బంపర్ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.టీటీడీ ఛైర్మన్‌గా తన సమీప బంధువు వైవీ సుబ్బారెడ్డిని నియమించిన జగన్‌…బోర్డు మెంబర్ల ఎంపికలోనూ తన మార్క్ చూపిస్తున్నారు.

తొలి నుంచి తనకు విధేయులకు ఉన్నవారికి ప్రాధాన్యం కల్పించడంతో కొంతమంది సినీ నటులకు బోర్డు మెంబర్లుగా అవకాశం కల్పించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. టాలీవుడ్ నుంచి నిర్మాత దిల్ రాజు పేరుతో పాటు అక్కినేని ఫ్యామిలీకి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది.

Image result for jagan hero sumanth

వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి అక్కినేని ఫ్యామిలీతో మంచి సంబధాలున్నాయి. ముఖ్యంగా నాగార్జున వైఎస్‌తో సన్నిహితంగా మెలిగారు. ఈ సాన్నిహిత్యం నేపథ్యంలో తన చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్ హీరో సుమంత్‌కు అవకాశం కల్పించనున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.

అయితే తొలుత అక్కినేని ప్యామిలీ నుంచి అమల పేరును జగన్ స్వయంగా ప్రతిపాదించారని సమాచారం.కానీ అమలకు బదులు సుమంత్‌కు ఇవ్వాలని కింగ్ సూచించాడట. దీంతో సుమంత్‌ వైపు జగన్ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. మొత్తంగా జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీలో సంచలనంగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.