సూపర్ స్టార్ కి తీరని కోరికలు

219
- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ ఇవ్వాళ ఉదయం ఓ ప్రయివేట్ హాస్పటల్ లో కన్నుమూసిన విషయం తెలిసిందే. కృష్ణ మరణ వార్త విని తెలుగు చిత్ర పరిశ్రమ షాక్ కి గురైంది. అభిమానుల హృదయాలు చెమ్మగిల్లాయి. అయితే సూపర్ స్టార్ మొన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్నారు. మొన్న అర్థరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని అభిమానులు కోరుకున్నారు. కానీ చేరిన కొన్ని గంటల్లోనే ఆయన తుది శ్వాస విడిచారు.

సూపర్ స్టార్ డేరింగ్ డాషింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. కృష్ణ చేసినన్ని ప్రయోగాలు మరే హీరో చేయలేదు. టెక్నాలజీ అంతగా లేని రోజుల్లోనే ఆయన ఎన్నో కొత్త విషయాలను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసి అందరి మన్ననలు అందుకున్నారు. కానీ కృష్ణ తనకున్న కొన్ని కోరికలు తీరకుండానే మరణం పొందారు.

కృష్ణకున్న మొదటి కోరిక ఛత్రపతి శివాజీ బయోపిక్. కొన్నేళ్ల క్రితమే ఆయనకు శివాజీ బయోపిక్ తీయాలనే బలమైన కోరిక ఉండేది. కానీ చేయలేక పోయారు. ఒక సినిమాలో శివాజీ మహారాజ్ గెటప్ లో కనిపించి ఆనందం పొందారు కానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆ రోల్ లో కనిపించలేదనే కోరిక మాత్రం మిగిలిపోయింది. కృష్ణ కున్న మరో కోరిక కొడుకు మహేష్ మనవడు గౌతమ్ తో కలిసి నటించడం. అవును రమేష్ బాబు, మహేష్ బాబు లతో కొన్ని సినిమాలో నటించిన సూపర్ స్టార్ కృష్ణ చివరిగా మహేష్, గౌతమ్ తో కలిసి మనం లాంటి మూడు జనరేషన్ సినిమా చేయాలని కోరుకునే వారట. మహేష్ బాబు రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో భారీ హిట్ కొడితే తండ్రిగా పొంగిపోవాలనే కోరిక ఉండేదట. ఈ కాంబో ఎనౌన్స్ అయ్యాక పలు సందర్భాల్లో మహేష్ – రాజమౌళి సినిమా గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తన్నానని సన్నిహితులతో చెప్పేవారట కృష్ణ. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటించబోయే హాలీవుడ్ స్టైల్ స్టైలిష్ యాక్షన్ సినిమా చూడకుండానే కృష్ణ ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. ఇలా తనకున్న కొన్ని కోరికలు తీరకుండానే కృష్ణ హఠాన్మరణం చెందారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ పెద్దలు, అభిమానులు కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి..

#Mahesh28 బ్రేకులే.. బ్రేకులు!

కృష్ణ..ఒకే హీరోయిన్‌తో 43 సినిమాలు

ఓ శకం ముగిసింది..తరతరాలకు ఆదర్శం వీరు!

- Advertisement -