పార్టీ ఫిరాయింపులు..బీఆర్ఎస్ పిటిషన్ వాయిదా

3
- Advertisement -

పార్టీ ఫిరాయింపుల పై బిఆర్ఎస్ వేసిన పిటిషన్ పై విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి…మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత ? అని ప్రశ్నించింది కోర్టు. రీజనబుల్ టైమ్ అంటే.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకా ? చెప్పాలని తెలంగాణ స్పీకర్ ను అడిగింది సుప్రీం కోర్టు.

స్పీకర్ను అడిగి నిర్ణయం చెపుతామన్నారు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి . పార్టీ ఫిరాయింపుల పై బిఆర్ఎస్ వేసిన పిటిషన్ పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.

పార్టీ ఫిరాయింపులు జరిగి పదేళ్లు అవుతున్న స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు ..కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు అన్నారు. హైకోర్టు రీజనబుల్ టైంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది .. రీజనబుల్ టైం అంటే ఎంత సమయం కచ్చితంగా టైం ఫ్రేమ్ ఉండాలి అని బీఆర్ఎస్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

- Advertisement -