- Advertisement -
రోజుకు ఎండలు మండిపోతున్నాయి.. ఎండ వేడికి ప్రజలు బయటికి రావలంటే జంకుతున్నారు.. ఎండల తీవ్రతకు తట్టుకోలేకపోతున్న ప్రజలకు మరో ‘వేడి’ వార్త. రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదరనున్నాయి.
తూర్పు దిశనుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొన్ని రోజులుగా 39 డిగ్రీలకు అటు ఇటుగా నమోదవుతున్నాయి. బుధవారం అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో 39.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ట్రంలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35.5 డిగ్రీల నుంచి 39.5 డిగ్రీల మధ్య నమోదయ్యాయని టీఎస్‌డీపీఎస్ తెలిపింది.
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జన సంచారం తగ్గి రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మండుతున్న ఎండలతో ఉక్కపోత భరించలేక ప్రజలు అల్లాడుతున్నారు.
- Advertisement -