నాలుగో టెస్టు…ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా అప్‌డేట్

64
England-vs-India

భారత్‌తో అహ్మదాబాద్‌‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గురువారం ప్రారంభమైన నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ఆదిలోనే వికెట్ కొల్పోయింది. ఓపెనర్ డొమినిక్ సిబ్లిని అక్షర్ పటేల్ పెవిలియన్ బాటపట్టించాడు. భారత్ తుది జట్టులో ఒక మార్పు.. హైదరాబాదీ బౌలర్‌కి ఛాన్స్ ఇవ్వగా ఇంగ్లాండ్ టీమ్‌లో రెండు మార్పులు చేసింది జోరూట్.

నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో ఇప్పటికే భారత్ జట్టు 2-1తో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఈ చివరి టెస్టుని కనీసం డ్రా చేసుకున్నా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కి టీమిండియా అర్హత సాధించనుంది.

హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ టీమ్‌లోకి ఇంగ్లాండ్ డాన్ లారెన్స్, స్పిన్నర్ డొమినిక్ బెస్‌లను తుదిజట్టులోకి తీసుకుంది.