ఐపీఎల్ 13…బోణి కొట్టిన సన్‌ రైజర్స్

120
warner

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఎట్టకేలకు బోణి కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 7‌ వికెట్లు కొల్పోయి 147 పరుగులు మాత్రమే చేసింది.

భువనేశ్వర్‌ కుమార్‌ వేసిన తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ పృథ్వీ షా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 17,శిఖర్ దావన్ 34 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టారు.రిషబ్ పంత్ 28,హెట్‌మెయిర్‌ 21.స్టయినిస్‌ 11 పరుగులు చేసి నిరాశపర్చారు.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లో 4 వికెట్లు కొల్పోయి 162 పరుగులు చేసింది. జానీ బెయిర్‌ స్టో(53: 48 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌), డేవిడ్‌ వార్నర్‌(45 :33 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు), కేన్‌ విలియమ్సన్‌(41:26 బంతుల్లో 5ఫోర్లు) రాణించడంతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో అమిత్‌ మిశ్రా,రబాడ చెరో రెండు వికెట్లు తీశారు.