బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 24 హైలైట్స్

110
bigg boss 4 episode

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 4 విజయవంతంగా 24 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. ఈసారి ఎలిమినేషన్‌కు 7గురు నామినేట్ కాగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లు,అభి-సోహైల్‌ల మద్య రచ్చతో ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.

స్వాతి దీక్షిత్‌తో ప్రేమగా మాట్లాడుతూ అభికి గట్టి పోటీ ఇస్తున్నాడు అఖిల్. అప్పటికే మోనాల్‌తో ముచ్చట్లు పెట్టిన అఖిల్.. స్వాతి దీక్షిత్ పాట అందుకుంటే దానికి శృతి కలిపాడు. ఇంత అందంగా ఎలా ఉండగలగుతున్నారు.. నేనూ తెలసుకోవాలనుకుంటున్నాను అంటూ తనదైన శైలిలో పులిహోర కలిపాడు అఖిల్.

అఖిల్-స్వాతి ముచ్చట్లు రంజుగా సాగుతుండగా.. స్వాతి కనురెప్ప వెంట్రుక రాలడంతో దాన్ని తీసి ఇచ్చాడు. అయితే దాంతో అఖిల్ మనసులో కోరిక తీరుతుందో లేదో టెస్ట్ చేసి చెప్పింది స్వాతి. తర్వాత దొంగతనం చేయడం ఎలా అన్నదానిపై ఇంటి సభ్యులకు క్లాస్ ఇచ్చాడు సొహైల్.

ఉక్కు హృదయం టాస్క్‌పై అభి-సొహైల్‌ల మధ్య మళ్లీ రచ్చ రేగింది. ఇక ఆ టాస్క్ రచ్చకి ఎండ్ ఉండదా అని అభి సొహైల్‌ని అడగడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఆడ పిల్లలతో గీకించుకున్నావ్ అని అభి అనగా కాస్త మగాడిలా ఆట ఆడు అంటూ సీరియస్ అయ్యాడు సొహైల్.గొడవ పెద్దది అవుతున్న క్రమంలో మొహబూబ్ ఇన్వాల్వ్ కావడంతో అభి…మెహబూబ్‌పై సీరియస్ అయ్యాడు.

తర్వాత కిల్లర్ కాయిన్స్‌ టాస్క్‌ను ఇంటి సభ్యులకు ఇచ్చారు బిగ్ బాస్‌. పై నుంచి కాయిన్స్ వేస్తాం ఏరుకోవడానికి ఇంటి సభ్యులు పోటీపడాలని చెప్పగా కాయిన్స్ కోసం సభ్యులంతా ఒకరిపై ఒకరు పడుతూ కొట్టుకుచచ్చారు.అఖిల్-మొనాల్ కలిసి ఆడటంపై అభి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.

ఇక బిగ్ బాస్ హౌస్‌లో అంతా తనను టార్గెట్ చేయడంపై సొహైల్ అందరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను దొంగ అన్న దివి,సుజాతలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఆటాడుతున్న వాళ్లంతా దొంగలే రచ్చరచ్చ చేశాడు. తర్వాత గ్రూపులుగా కిల్లర్ కాయిన్స్ టాస్క్ ఆడుతున్న సభ్యులపై బిగ్ బాస్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎపిసోడ్ ముగిసింది.