ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కరోనా పాజిటివ్…

129
venkaiah naidu

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఎలాంటి లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయన హోంఐసోలేషన్‌లో ఉన్నారు. మంగళవారం ఉదయం ఆయన కొవిడ్‌-19 పరీక్ష చేయించుకున్నారు. ఎలాంటి లక్షణాలు లేవని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు వైస్‌ప్రెసిడెంట్‌ సెక్రటేరియెట్‌ ట్విట్టర్‌లో పేర్కొంది. ఆయన సతీమణి ఉషా నాయుడు కూడా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా, నెగెటివ్‌ వచ్చింది.