టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌..

212
SunRisers Hyderabad
- Advertisement -

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా ఈరోజు రాయల్‌ ఛాలెంజన్స్‌ బెంగళూరు,సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తొలి మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్ వేదికగా ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి సన్‌రైజర్స్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది. డేవిడ్‌ వార్నర్‌ సారథ్యంలోని హైదరాబాద్‌.. కోహ్లీ కెప్టెన్సీలోని బెంగళూరు జట్లూ అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి మ్యాచ్‌లోనే బోణీ చేయాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.

2016లో జట్టుకు తొలి టైటిల్‌ అందించిన డేవిడ్‌ వార్నర్‌ రెండేండ్ల తర్వాత మళ్లీ జట్టు పగ్గాలు చేపట్టగా.. జానీ బెయిర్‌స్టో, కేన్‌ విలియమ్సన్‌, మనీశ్‌ పాండేలతో హైదరాబాద్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా కనిపిస్తున్నది. గతేడాది పాయింట్ల పట్టికలో చివర్లో నిలిచిన బెంగళూరు శుభారంభం చేయాలని పట్టుదలతో ఉంది. స్టార్‌ ప్లేయర్లు కెప్టెన్‌ కోహ్లీ, డివిలియర్స్‌కు అరోన్‌ ఫించ్‌, క్రిస్‌ మోరిస్‌ తోడవడంతో ఆ టీమ్‌ మరింత బలోపేతమైంది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: వార్నర్‌ (కెప్టెన్‌), బెయిర్‌ స్టో, మనీశ్‌, విజయ్‌ శంకర్‌, మిచెల్ మార్ష్, రషీద్‌, ప్రియామ్ గార్గ్, అభిషేక్‌ శర్మ, భువనేశ్వర్‌, సందీప్‌ శర్మ, టి నటరాజన్,

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు: కోహ్లీ (కెప్టెన్‌), ఫించ్‌, పడిక్కల్‌, డివిల్లీర్స్‌ , శివమ్‌ దూబే, సుందర్‌, నవ్‌దీప్‌, ఉమేశ్‌.జోష్ ఫిలిప్, డేల్ స్టెయిన్, యుజ్వేంద్ర చాహల్‌.

- Advertisement -