భూవివాదాల్లోకి వస్తే పీడీ యాక్ట్: జోయెల్ డేవిస్

154
joel davis

సంబంధంలేని వారు భూవివాదాల్లో జోక్యం కేసుకుంటే పీడీయాక్ట్ నమోదుచేస్తామని తెలిపారు సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయెల్ డేవిస్. యజమానులు తప్ప మరెవరైనా భూవివాదాల్లోకి వస్తే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు.

చేర్యాల పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఆయన హుస్నాబాద్ సబ్ డివిజనల్ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన భూవివాదాల్లో సంబంధం లేని వ్యక్తులు వస్తే ప్రజలు 7901100100కు వాట్సాప్ మెసేజ్ పంపాలని లేదా పోలీస్ కమిషనర్ ఫోన్ నంబర్ 8332921100కు లేదా డయల్‌ 100 కు ఫోన్‌చేయాలని కోరారు. ఫిర్యాదుదారుల పేర్లను వెల్లడించబోమని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.