హ్యాట్రిక్‌ కొట్టిన హైదరాబాద్‌..

286
Sunrisers Hyderabad beat Kolkata Knight Riders
- Advertisement -

లక్ష్యం తక్కువే అయినా ఛేదనలో కష్టపడడం అనే అలవాటును సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొనసాగిస్తోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను 138 పరుగులకే కట్టడి చేసినా.. ఛేదనలో ఆ జట్టు వేగంగా ఆడలేకపోయింది. హైదరాబాద్‌కు ఇది వరుసగా మూడో విజయం. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అటు బౌలింగ్‌లో.. ఇటు బ్యాటింగ్‌తో పాటు మెరుపు ఫీల్డింగ్‌తో మెప్పించి వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన వర్ష ప్రభావిత మ్యాచ్‌లో ఐదు వికెట్లతో గెలిచింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన ఆతిథ్య కోల్‌కతా పర్యాటక బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులు చేసింది. క్రిస్‌ లిన్‌ (34 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 49) చెలరేగగా.. కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (27 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 29) రాణించాడు. భువనేశ్వర్‌ కుమార్‌ (3/26), షకీబల్‌ హసన్‌ (2/21), స్టాన్‌లేక్‌ (2/21) సత్తా చాటారు. అనంతరం కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (44 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 50), షకీబల్‌ హసన్‌ (21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 27) సత్తాచాటడంతో హైదరాబాద్‌ 19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సునీల్‌ నరైన్‌ (2/17) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు.

Sunrisers Hyderabad beat Kolkata Knight Riders

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: ఉతప్ప (సి) సాహా (బి) భువనేశ్వర్‌ 3; లిన్‌ (సి) అండ్‌ (బి) షకిబ్‌ 49; నితీష్‌ రాణా (సి) పాండే (బి) స్టాన్‌లేక్‌ 18; నరైన్‌ (సి) విలియమ్సన్‌ (బి) షకిబ్‌ 9; కార్తీక్‌ (సి) సాహా (బి) భువనేశ్వర్‌ 29; రసెల్‌ (సి) పాండే (బి) స్టాన్‌లేక్‌ 9; శుభ్‌మన్‌ గిల్‌ (సి) షకిబ్‌ (బి) భువనేశ్వర్‌ 3; శివం మావి (సి) భువనేశ్వర్‌ (బి) సిద్దార్థ్‌ కౌల్‌ 7; జాన్సన్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 138.

వికెట్ల పతనం: 1-16, 2-55, 3-79, 4-87, 5-96, 6-112, 7-129, 8-138;
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-26-3; స్టాన్‌లేక్‌ 4-0-21-2; కౌల్‌ 4-0-37-1; రషీద్‌ 4-0-31-0; షకిబ్‌ 4-0-21-2

Sunrisers Hyderabad beat Kolkata Knight Riders

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: సాహా (సి) కార్తీక్‌ (బి) నరైన్‌ 24; ధావన్‌ (బి) నరైన్‌ 7; విలియమ్సన్‌ (సి) రసెల్‌ (బి) జాన్సన్‌ 50; మనీష్‌ పాండే ఎల్బీ (బి) కుల్‌దీప్‌ 4; షకిబ్‌ (బి) చావ్లా 27; హుడా నాటౌట్‌ 5; యూసుఫ్‌ పఠాన్‌ నాటౌట్‌ 17; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (19 ఓవర్లలో 5 వికెట్లకు) 139;

వికెట్ల పతనం: 1-32, 2-46, 3-55, 4-114, 5-119
బౌలింగ్‌: జాన్సన్‌ 3-0-30-1; రసెల్‌ 3-0-39-0; నరైన్‌ 4-0-17-2; పియూష్‌ చావ్లా 4-0-20-1; కుల్‌దీప్‌ 4-0-23-1; శివమ్‌ మావి 1-0-10-0

- Advertisement -