రైజర్స్‌ ‘టాప్‌’ గేర్‌

234
-sunrisers-hyderabad-
- Advertisement -

ఐపీఎల్‌ 11లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జోరు కొనసాగుతుంది. ప్రత్యర్థి మారుతున్నదే తప్ప..సన్‌రైజర్స్ విజయాల జోరు తగ్గడం లేదు..చిన్న లక్ష్యమైనా, పెద్ద లక్ష్యమైనా హైదరాబాద్ ఆటగాళ్లు సమిష్ఠి ప్రదర్శనతో ఊదేస్తున్నారు..కుర్ర జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆఖర్లో కాసింత కంగారు పెడదామని చూసినా, రైజర్స్ అనుభవం ముందు కుదేలైపోయింది..బౌలింగ్‌లో ఎప్పటిలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రషీద్ మెరువగా, బ్యాటింగ్‌లో టాపార్డర్ ఆకట్టుకున్నది. సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ డేర్‌డెవిల్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది.

-sunrisers-hyderabad-

ఉత్కంఠకరంగా మారిన పోరులో యూసఫ్‌ పఠాన్‌ (27 నాటౌట్‌; 12 బంతుల్లో ), కేన్‌ విలియమ్సన్‌ (32 నాటౌట్‌; 30 బంతుల్లో) రాణించడంలో విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యాన్ని ఇంకా రెండు బంతులు ఉండగానే ఫినిష్ చేసింది. అంతకు ముందు ఢిల్లీ పృథ్వీ షా (65;), శ్రేయస్‌ అయ్యర్‌ (44) రాణించడంతో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఛే ఈ ఓటమితో దిల్లీ ఫ్లేఆప్‌ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. మరోవైపు పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్‌ అగ్రస్థానానికి చేరింది.

- Advertisement -