కథువా ఘ‌ట‌న‌పై స్పందించిన సన్నీ..

243
Sunny Leone's 'Promise' To Daughter Nisha
- Advertisement -

ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ళ చిన్నారి అసిఫా పై అతి దారుణంగా జరిగిన మానభంగం హత్య దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు కారణం అవుతోంది. ఎంతటి బండరాయికైనా హృదయం ద్రవించేలా సామూహికంగా ఆ బాలిక శీలాన్ని దోచుకున్న తీరు చూసి బాలీవుడ్ తారాలోకం మొత్తం తల్లడిల్లుతోంది. ఇప్పటికే పలువురు ట్విట్టర్ ద్వారా తమ ఆవేదనను పంచుకోగా కొందరు వినూత్నంగా పెద్ద అక్షరాలతో రాసిన ప్ల కార్డ్స్ పట్టుకుని ఫోటోల ద్వారా నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Sunny Leone's 'Promise' To Daughter Nisha

ఈ ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా దేశ‌వ్యాప్తంగా సినీ ప్ర‌ముఖులు త‌మ తమ సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా త‌మ గ‌ళాన్ని వినిపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ న‌టి స‌న్నీ లియోన్ కూడా ఈ ఘ‌ట‌న‌పై స్పందించింది. భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేసింది. అయితే స‌న్నీలియోన్ దంప‌తులు గతంలో నిషా కౌర్ అనే బాలిక‌ను ద‌త్త‌త తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఆ బాలిక‌ను ఒడిలో కూర్చోబెట్టుకుని తీయించుకున్న ఫోటోను పోస్ట్ చేసిన స‌న్నీ దానికి ఓ కామెంట్‌ను జ‌త చేసింది. `ఈ ప్ర‌పంచంలో ఉన్న చెడు నుంచి నిన్ను ఎల్ల‌వేళలా ర‌క్షించుకునేందుకే నా హృద‌యం, దేహం ఉన్నాయ‌ని నీకు ప్ర‌మాణం చేస్తున్నా. నీ ర‌క్ష‌ణ కోసం నా ప్రాణాల‌నైనా పణంగా పెడ‌తా. చిన్నారులు ఎప్పుడూ సుర‌క్షితంగా ఉండాలి. వారి ర‌క్ష‌ణ కోసం మ‌నం ఏమైనా చేయాలి. వారిని కాపాడండి` అని స‌న్నీ లియోన్ ట్వీట్ చేసింది.

- Advertisement -