ప్రముఖ పోర్న్‌స్టార్ రేంజ్ నుంచి బాలీవుడ్ స్టార్ రేంజ్‌కు ఎదిగిపోయింది సన్నిలియోన్. బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో సరిసమానమైన క్రేజ్‌తో దూసుకుపోతోన్న సన్నిలియోన్ ఇప్పుడు వరుసగా సినిమాలు, ఐటెం సాంగ్‌లు, లైవ్ పెర్పామెన్స్‌లతో చాలా బిజీబిజీగా ఉంటోంది. క్షణం తీరిక లేని సన్ని రెండు చేతులా బాగానే సంపాదిస్తోంది. అందాలను ఆరబోయడంలో సన్నిలియోన్ ముందుంటుంది
పోర్న్ సినిమాలతో అర్ధసెంచరీ కొట్టిన అమ్మాయిని పోర్న్ స్టార్ అనక ఇంకేమనాలి? సన్నీ పోర్న్ స్టార్ కాక ఇంకేంటి.. అంటారా? ఐతే తాను మారిన మనిషిని అని సన్నీనే స్వయంగా చెబుతోంది. ఒక పోర్న్ స్టార్ గా ఇండియాలో అడుగుపెట్టినపుడు తన ఆలోచనలు చాలా భిన్నంగా ఉండేవని.. కానీ గత కొన్నేళ్లలో ఇండియాలో గడిపిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని.. జనాలు సైతం తన పట్ల తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారని సన్నీ వ్యాఖ్యానించింది. పోర్న్ ఇండస్ట్రీని వదిలేసి అప్పుడే ఇండియాలో అడుగుపెట్టిన తనను జనాలు ఎలా చూశారో.. తన పట్ల ఎంత వ్యతిరేకతతో ఉన్నారో తనకు గుర్తుందని సన్నీ వ్యాఖ్యానించింది.
ఐతే ఇండియాలో సంస్కృతి సంప్రదాయాలు పూర్తి భిన్నం అని.. తాను పెరిగిన వాతావరణం వేరు అని.. తన పట్ల ఎందుకంత వ్యతిరేకత ఎదురైందన్న సంగతి ఇక్కడ కొన్నేళ్లు గడిపాక తనకు అర్థమైందని సన్నీ తెలిపింది. భారతీయ స్త్రీకి పోర్న్ అనేది ఎంత పెద్ద తప్పిదమో తనకు ఇప్పుడర్థమైందని.. అయినప్పటికీ ఒకప్పటి తన కెరీర్ గురించి తనకు రిగ్రెట్స్ ఏమీ లేవని సన్నీ స్పష్టం చేసింది. ఇప్పుడు భారతీయ జనాలు కూడా తనను అంగీకరించారని.. అర్థం చేసుకున్నారని.. వారిలో వచ్చిన మార్పు తర్వాత తాను కూడా ఎంతో మారానని సన్నీ తెలిపింది. తన భర్త కూడా ఇక్కడి పరిస్థితుల్ని అర్థం చేసుకున్నాడని అంది. ప్రస్తుతానికైతే ఇండియాను విడిచి పెట్టి వెళ్లే ఉద్దేశం లేదని.. తాను ఇక్కడే సెటిలవ్వాలని అనుకుంటున్నానని సన్నీ స్పష్టం చేయడం విశేషం.