వీరిలో అనుష్క అందగాడెవరు..?

237
anushka-shetty-tells-us-whos-sexier
- Advertisement -

‘బాహుబలి-2’ కలెక్షన్ల పరంగా ఎంత రికార్డు సృష్టించిందో,ఇందులో పాత్రలు ప్రభాస్, రానా, అనుష్కల నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ‘బాహుబలి-2’లో ప్రభాస్, అనుష్కల మధ్య ప్రేమ సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా, ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో అనుష్కను ఓ ఆసక్తికర ప్రశ్న అడిగితే, ఏమాత్రం తడుముకోకుండా ప్రభాస్‌ అందంగా ఉంటారని బదులిచ్చారు. రానా తనకు సోదరుడు లాంటివాడని తెలిపింది స్వీటీ. ‘ఆయన(రానా) నన్ను బ్రదర్‌ అంటారు.. నేనూ బ్రదర్‌ అనే పిలుస్తా’ అని చెప్పుకొచ్చింది..

Prabhas-Anushka-Shetty-marriage

ఇప్పుడు స్విటీ ఇలా ఎందుకు చెప్పిందన్న డౌట్ రావోచ్చు.. వీరిద్దరికి చాలా రోజుల నుంచి మంచి కెమిస్ట్రీ ఉంది. వీరిద్దరు కలిసి ‘బిల్లా’, ‘మిర్చి’, ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ దగ్గరయ్యారని, ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు బాగా అర్థం చేసుకున్నారని, ఈ క్రమంలోనే ఒకరంటే ఒకరు ఇష్టం పెంచుకున్నారని…. బాహుబలి సినిమా షూటింగ్ ముగిసే సమయానికి ఇద్దరి ప్రేమ వ్యవహారం మరింత ముదిరిందన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అనుష్క ‘భాగ‌మ‌తి’ చిత్రంలో నటిస్తున్నారు. జి. అశోక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. ఎస్‌. తమన్‌ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.

https://www.instagram.com/p/BUEfFpnl-B5/

- Advertisement -