సన్నీ సాంగ్‌కు సెన్సార్‌ కట్‌..

292
- Advertisement -

పోర్న్‌స్టార్ రేంజ్ నుంచి బాలీవుడ్ స్టార్ రేంజ్‌కు ఎదిగిపోయింది స‌న్నిలియోన్‌. బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో స‌రిస‌మానమైన క్రేజ్‌తో దూసుకుపోతోన్న స‌న్నిలియోన్ ఇప్పుడు వ‌రుస‌గా సినిమాలు, ఐటెం సాంగ్‌లు, లైవ్ పెర్పామెన్స్‌ల‌తో చాలా బిజీబిజీగా ఉంటోంది. ఇప్పటివరకు అమ్మడు ఏ సినిమా చేసినా సంచలనమే. అలాగే ఏ స్పెషల్ సాంగ్స్ లో చిందేసినా ఆ పాట సూపర్ హిట్ అవ్వాల్సిందే. కేవలం తన గ్లామర్ తో సినిమాకి హైప్ తెచ్చే ఈ ముద్దుగుమ్మ వల్ల ఇప్పుడు ఓ సినిమాకి కాస్త ఇబ్బందులు తెచ్చి పెట్టాయి.

Sunny Leone Item Song Censored

సంజయ్ దత్ చాలా రోజుల తర్వాత మెయిన్ రోల్ లో భూమి అనే సినిమాను చేస్తున్నాడు. మేరీకోమ్ – సరబ్ జిత్ వంటి సూపర్ హిట్ చిత్రాలని తెరకెక్కించిన ఒముంగ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అయితే చిత్రంలో కథను మలుపు తిప్పే సన్నివేశంలో సన్నీ లియోన్ తో ఐటెమ్ సాంగ్ చేయించారు దర్శకనిర్మాతలు. కానీ పాటకి సెంట్రల్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వారు చాలా కట్స్ చెప్పారట. కేవలం టెలివిజన్ లో చూపించిన భాగాన్ని మాత్రమే ఉంచారట దీంతో సినిమాలో సన్నీ పాట చాలా బావుంటుందని మొత్తం చూద్దామని వెళ్లే వారికి మాత్రం నిరాశ తప్పదు. అలాగే అదితి రావ్ పై జరిగే రేప్ సీన్స్ ను కూడా కాస్త తగ్గించమని చెప్పారట సెన్సార్ సభ్యులు. వాటితో పాటు కొన్ని మాటలు కూడా ట్రిమ్ చేయమని చెప్పడంతో దర్శకుడు ఆ విషయాల్లో చాలా అసంతృప్తిని వ్యక్తం చేశాడట.

Sunny Leone Item Song Censored

అయితే వారు కట్ చేయమని చెప్పిన సీన్స్ సినిమాకు చాలా అవసరమని ఇంతకుముందు కూడా తన సినిమాల్లో చాలా సినిమాల్లో అలాంటి సీన్స్ ఉండేవని చెబుతున్నాడు. అలాంటిది ఇప్పుడు కట్ చేయమని చెప్పడం సరికాదని ఒముంగ్ ఆవేదన చెందుతున్నాడు. మరి సన్నీ కోసం చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అలాంటిది సన్నీ అసలు సీన్స్ సినిమాలో లేకపోతే సినిమాకి కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

- Advertisement -