క్లీన్‌ స్పైడర్‌

224
Mahesh at spyder pre release function
- Advertisement -

మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘ స్పైడర్’. ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు వారు క్లీన్‌ యు/ఎ సర్టిఫికెట్ ను మంజూరు చేశారు.   ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్‌ ఎలాంటి కట్లు ఇవ్వకపోవడం  విశేషం. సెన్సార్ సందర్భంగా ఈ సినిమాను చూసిన సభ్యులు, చిత్రయూనిట్ ను అభినందించారట. మహేష్ బాబు ఖాతాలో మరో సూపర్ హిట్ వచ్చి చేరిందని పేర్కొన్నారట. ప్రధానంగా యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని కితాబునిచ్చారట.

ఇప్పటికే ఈ సినిమా టీజర్లకు .. ట్రైలర్ కి .. ఆడియోకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్లో నా పేరు శివ అంటూ మహేశ్ బాబు చెప్పే వాయిస్ ఓవర్‌తో మొదలై ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఒక నిమిషం 52సెకన్ల నిడివిలో స్పైడర్ టీజర్‌ కనువిందు చేసింది. టీజర్‌లో, సాంగ్స్ ప్రోమోల్లో ఉన్న కొన్ని సీన్లు ట్రైలర్‌లో కూడా రిపీట్ కావడంతో ఫ్యాన్స్ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్‌ను గమనిస్తే యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని స్పష్టమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో టీజర్‌ను విడుదల చేశారు.

మహేష్‌ బాబు, మురుగదాస్‌లు ఆడియో వేడుకలో తమ స్పీచ్‌లతో సినిమాపై అంచనాలు పెంచేశారు. రకుల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, తమిళ నటులు ఎస్.జె. సూర్య .. భరత్ విలన్ పాత్రల్లో కనిపించనున్నారు. మహేశ్ బాబు కెరియర్లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను, తెలుగు .. తమిళ భాషలతో పాటు అరబిక్ భాషలోను విడుదలవుతుండటం విశేషం.

- Advertisement -