ప్రముఖ పోర్న్‌స్టార్ రేంజ్ నుంచి బాలీవుడ్ స్టార్ రేంజ్‌కు ఎదిగిపోయింది సన్నిలియోన్. బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో సరిసమానమైన క్రేజ్‌తో దూసుకుపోతోన్న సన్నిలియోన్ ఇప్పుడు వరుసగా సినిమాలు, ఐటెం సాంగ్‌లు, లైవ్ పెర్పామెన్స్‌లతో చాలా బిజీబిజీగా ఉంటోంది.
బాలీవుడ్ లో ఐటం సాంగులకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది సన్నీ లియోన్.
అయితే తాజాగా యాంగ్రీ యంగ్ మేన్ డా. రాజశేఖర్ హీరోగా నటించిన పీఎస్‌వీ గరుడవేగ 126.18 సినిమాలో బాలీవుడ్ ఐటంగాళ్ సన్నిలియోన్ ఓ ఐటం సాంగ్ చేస్తోందని.. ఆ పాట ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ కానుందని తరచుగా చెబుతూ వస్తోన్న పీఎస్‌వీ గరుడవేగ మూవీ యూనిట్ సభ్యులు తాజాగా అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
రాయిస్ సినిమాలో లైలా మై లైలా సాంగ్‌లో కనువిందు చేసిన విధంగానే గరుడవేగ సినిమాలోని ఐటంసాంగ్‌లోనూ సన్నిలియోన్ సెక్సీ లుక్స్‌తో అదరగొట్టింది. సన్నిలియోన్ అభిమానులకి దసరా కానుకగా రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్‌ని తెగ టెంప్ట్ చేస్తోందనే చెప్పాలి.