పండగపూట కన్ఫూజ్‌ చేస్తున్న రవితేజ..!

191
- Advertisement -

విజయదశమి సందర్భంగా నేడు దేశ వ్యాప్తంగా దసరా పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు సినిమా ప్రేక్షకులకు టాలీవుడ్ ప్రముఖులు దసరా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇదే క్రమంలో మాస్ మహారాజా రవితేజ కూడా శుభాకాంక్షలు చెప్పాడు. కానీ ..చెప్పింది దసరా శుభాకాంక్షలు కాదు..దీపావళి శుభాకాంక్షలు.

 Dussehra Wishes from Raja The Great -

అవును.. అందరిలా కాకుండా రవితేజ మాత్రం దసరా శుభాకాంక్షలను కొత్తగా చెప్పాడు. ఈ దీపావళికి ‘రాజా ది గ్రేట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న రవితేజ.. ఆ సినిమాలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, హీరోయిన్ మెహ్రీన్, కమెడియన్ శ్రీనివాసరెడ్డిలతో తెలుగు ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ వీడియోను యూట్యూబ్‌లో పెట్టింది. దీన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. వీడియోలోనే చిన్న మత్లబ్ ఉంది. ఆ వీడియోలో రాజేంద్రప్రసాద్ అందరికీ దసరా శుభాకాంక్షలు అని చెబుతుండగా.. వెంటనే రవితేజ ‘దీపావళి శుభాకాంక్షలు’ అని చెబుతున్నాడు. మొత్తానికి దసరా సందర్భంగా ‘రాజా ది గ్రేట్’ను ఇలా ప్రొమోట్ చేస్తున్నారన్నమాట.

- Advertisement -