పోర్న్‌స్టార్ నుండి ఫిలింస్టార్ గా మారిన నటి సన్నీలియోన్. ఈ సెక్స్ బాంబ్ సన్నీలియోన్ ఏం చేసినా సెక్సీగా ఉంటుంది. అందుకే ఈ శృంగార తారకి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. యువత గుండెల్లో సన్నీ ఒక శృంగార దేవత. అందుకే ఈమె అందాలు అడ్డు పెట్టుకుని క్యాష్ చేసుకోవాలని దర్శక-నిర్మాతలు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంతవరకు సన్నీ నటించిన సినిమాల్లో కథ లేకుండానే మొత్తం ఆరబోతతోనే కథల్ని తెరకెక్కించారంటే అది సన్నీ క్రేజ్.
శృంగార దేవతగా ఒక వెలుగువెలుగుతుండగానే ఇకపై ఇలాంటి సినిమాల్లో నటించని కుర్రకారుకు షాకిచ్చిన సన్నీ…..తాను పోర్న్ స్టార్ కాదని నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది.ఈ ప్రయత్నంలో బాగంగా సన్నీకి బీబీసీ 100 మహిళల 2016 జాబితాలో చోటు సంపాదించుకుంది.ప్రపంచ వ్యాప్తంగా ప్రభావవంతమైన, ప్రేరణ కలిగించిన మహిళగా అమెను బీబీసీ గుర్తించింది.
2011లో వివాదస్పద బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా బాలీవుడ్‌కు సన్నీలియోని పరిచయమైంది. ఆ తర్వాత జిస్మ్- 2, జాక్‌పాట్, ఏక్ పహేలీ లీలా చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఈమెతోపాటు 105 ఏళ్ల కన్నడ మహిళ సాళుమారడ తిమ్మక్క, గౌరీ చిందార్కర్, మల్లికా శ్రీనివాసన్, నేహా సింగ్ ఈ జాబితాలో ఇండియా నుంచి చోటు సంపాదించారు. కన్నడ మహిళ సాళుమారడ తిమ్మక్క హలికర్, కుడుర్ మధ్య నాలుగు కిలోమీటర్ల మేర సుమారు 400 వందల మర్రిచెట్లను నాటి, వాటిని సంరక్షించినందుకు ఈ 105 ఏళ్ల ముసలివ్వను బీబీసీ 2016 జాబితాలో చేర్చింది.
సన్నీలియోన్‌తో సాలుమారద తిమ్మక్క (కర్ణాటక) భారత్ నుంచి చోటు దక్కించుకున్న మహిళల్లో ఉన్నారు. కాగా, ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్ మెంట్ (టీఏఎఫ్ఈ) సీఈవోగా వ్యవహరిస్తున్న ‘ట్రాక్టర్ క్వీన్ ఆఫ్ ఇండియా’ గా ప్రసిద్ది చెందారు. ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ట్రాక్టర్స్ తయారీ సంస్థగా టీఏఎఫ్ఈ కొనసాగుతుండడం విశేషం.బీబీసీ 100మంది ప్రభావశీల మహిళల జాబితాలో తిమ్మక్కనే అత్యంత వృద్దురాలు కావడం గమనార్హం.