కేజ్రీకి మద్దతివ్వండి:సునీతా కేజ్రీవాల్

27
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈడీ కస్టడీ నుండి పాలన చేస్తున్నారు కేజ్రీవాల్. ఇక కేజ్రీ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆప్ చేస్తున్న ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 31న ఇండియా కూటమి నిరసన చేపట్టనున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌కు మ‌ద్ద‌తు ఇవ్వాలని ప్రజలను కోరారు ఆయ‌న భార్య సునితా కేజ్రీవాల్ . ఓ వాట్సాప్ నెంబ‌ర్‌ను ఆమె షేర్ చేశారు. ఆమ్ ఆద్మీ నేత‌కు మెసేజ్‌లు చేయాల‌ని ఆ నెంబ‌ర్‌ను ఆమె వెల్ల‌డించారు.

కేజ్రీవాల్‌ను ఆశీర్వ‌దించాల‌ని డ్రైవ్ చేప‌డుతున్నామ‌ని, 8297324624 వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ దీవెన‌లు, ప్రార్థ‌న‌ల‌ను మెసేజ్ చేయాల‌ని, మీరు ఎటువంటి మెసేజ్ చేయాల‌నుకున్నా చేయ‌వ‌చ్చు అని సునితా తెలిపారు. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌ని మార్చి 21వ తేదీన అరెస్టు చేశారు. ఏప్రిల్ ఒక‌టో తేదీ వ‌ర‌కు ఆయ‌న క‌స్ట‌డీని పొడిగించారు.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలివే..

- Advertisement -