తెలుగులోను 2 కంట్రీసే

235
Sunil Shankar movie titled 'Two Countries'
- Advertisement -

కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి, హీరోగా అవకాశాలు అందిపుచ్చుకున్న సునీల్ ఆ తర్వాత తన హీరో స్టేటస్‌ని అలాగే పదిలపర్చుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూనే వున్నాడు. సామాజిక ఇతివృత్తాలతో ప్రేక్షక జనరంజకంగా సినిమాలను తెరకెక్కించే దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శంకర్‌ తొలిసారి వినోదాత్మక కథాంశంతో ప్రేక్షకుల ముందుకువస్తున్నాడు.

ఈ సినిమాకు  ‘2 కంట్రీస్‌’ అనే పేరును ఖరారు చేశారు. మలయాళంలో ఇదే పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. మనీషా రాజ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నరేష్‌, శ్రీనివాసరెడ్డి, పృధ్వీ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకనిర్మాత ఎన్.శంకర్ మాట్లాడుతూ డబ్బును అమితంగా ప్రేమించే ఓ యువకుడి కథ ఇది. ధనమే అన్నింటికి మూలం కాదు ప్రేమాభిమానాలే ముఖ్యమని అతడు ఎలా తెలుసుకున్నాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన అనుభవాలేమిటన్నది ఆసక్తిని పంచుతుంది. మలయాళ చిత్రం టూ కంట్రీస్ ఆధారంగా రూపొందిస్తున్నాం. సునీల్ శైలి వినోదంతో పాటు కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల ప్రధానంగా సాగుతుంది. నటుడిగా సునీల్‌ని కొత్త పంథాలో ఆవిష్కరించే చిత్రమిది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో ఫస్ట్‌లుక్‌ను, డిసెంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు.

- Advertisement -