నాని..ఎంసీఏ టీజర్‌

337
MCA TEASER
- Advertisement -

వరుస హిట్లతో మంచి జోరు మీదున్న నాని ప్రస్తుతం వేణు శ్రీరాం దర్శకత్వంలో ఎంసీఏ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది. దీపావళి కానుకగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో లుంగీతో  ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చాడు.

తాజాగా చిత్ర టీజర్ విడుదల చేసి ఫ్యాన్స్ లో జోష్ పెంచింది చిత్ర యూనిట్ . ఇందులో ఎంసీఏ అంటే ఏంటో క్లుప్తంగా వివరించాడు నాని. మొత్తానికి ‘ఎంసిఏ’ అలియాస్ ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ టీజర్ మాత్రం అదిరిందనే చెప్పాలి. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలని త్వరలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటుంది చిత్ర యూనిట్.

- Advertisement -