నేను క్షేమంగా ఉన్నాను- నటుడు సునీల్‌

491
sunil
- Advertisement -

టాలీవుడ్‌ నటుడు సునీల్ ఇటీవల అనారోగ్యం బారిన పడి ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ఆయన ఆసుపత్రిలో చేరారనే వార్తతో సినీ వర్గాలు, అభిమానులు ఉలిక్కిపడ్డారు. ఏమైందో అని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో, సునీల్ స్పందించారు. తనకు ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడిందని ఆయన తెలిపారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన సునీల్, “నా క్షేమాన్ని కోరుకునే మీలాంటి వారి ఆశీస్సులతో క్షేమంగా ఉన్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. నాపై చూపించిన ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు. మీరందరూ ‘డిస్కో రాజా’ చూసి ఆనందించండి” అని పేర్కొన్నారు.

- Advertisement -