మా.. హేమ వర్సెస్ కరాటే కల్యాణి

60
hema

మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీచేస్తున్న ప్రకాశ్‌ రాజ్- మంచు విష్ణు మధ్యే కాదు ఆ ప్యానల్‌లోని సభ్యుల మధ్య మాటల యుద్ధం తారాస్ధాయికి చేరింది. హేమ వర్సెస్ కరాటే కళ్యాణి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.

సోషల్ మీడియాలో హేమ ఫోటోలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో స్పందించారు ఆమె. తన ఫోటోలను మార్పింగ్ చేసి తన పరువుతీయాలని చూస్తున్నారని మా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది హేమ. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని మండిపడింది.

అయితే హేమ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు కరాటే కళ్యాణి. హేమ ఎవరికి కంప్లైంట్ ఇచ్చిన తనకు అవసరం లేదన్నారు. అవసరమైతే తమ దగ్గర వున్నా సాక్ష్యాలను బయటపెడుతామన్నారు. నీ ఓటు గూర్చి నువ్వు అడగటం మానేసి.. కళ్యాణ్ ని ఓడించండి అంటూ క్యాంపెన్ చేయడంలోనే నువ్వు ఎంత వీకో అర్ధమవుతోందని మండిపడింది కళ్యాణి.