సందీప్ కిషన్ ప్రస్తుతం కేరాఫ్ సూర్య సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ఈ 10న థియేటర్స్ కి వస్తున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన మోహ్రీన్ జత కట్టింది. సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సందీప్ కిషన్ కూడా ఈ సినిమా విజయం పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
కాగా ఈ చిత్రం ప్రమోషనల్ భాగంగా సందీప్ తనకు ఇన్పిషిరేషన్ ప్రిన్స్ మహేష్ బాబు అని చెప్పాడు.మహేష్ బాటలోనే పయనించడానికి తాను ప్రయత్నిస్తున్నానని సందీప్ చెప్పాడు.తనకు ఎంతో ఇష్టమైన హీరో మహేష్ బాబు అని, ఆయన ఎప్పుడూ ప్రేక్షకులకు కొత్త దనాన్ని అందించాలని ప్రయత్నిస్తుంటారని సందీప్ కితాబిచ్చాడు. అభిమానుల కోసం ఎప్పటికపుడు కొత్త లుక్ లో కనిపిస్తుంటారని చెప్పాడు. విభిన్నమైన పాత్రలను చేయడానికే ఆయన ఎక్కువగా ఆసక్తి చూపుతారని అభిప్రాయపడ్డాడు. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారేమోనని తనకు అనిపిస్తూ ఉంటుదన్నాడు. అందుకే తాను మహేష్ ను స్ఫూర్తిగా తీసుకుని, ఆయన మార్గంలో వెళుతున్నానని సందీప్ చెప్పాడు.
కేరాఫ్ సూర్య కాకుండా రాబోయే నెలల్లో సందీప్ కిషన్ నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. తమిళంలో మాయవన్, నరగసూరన్ చిత్రాలతో పాటు కునాల్ కోహ్లి దర్శకత్వంలో ఓ తెలుగు సినిమా, మహేష్ సోదరి మంజుల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సందీప్ కిషన్.