సన్నాఫ్ సునామి..ప్రారంభం

14
- Advertisement -

ఆసక్తికరమైన కథ, కథనాలతో తెలుగు తెర‌పైకి రాబోతున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్ ”సన్నాఫ్ సునామి”. దిలీప్ కుమార్ రాథోడ్, అరవిందా అగర్వాల్, షణ్ణు హీరోహీరోయిన్లుగా చిత్తజల్లు ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న ”సన్నాఫ్ సునామి” హైద‌రాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. శతృవుల గుండెల్లో దడ ట్యాగ్ లైన్. కృష్ణ ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ”సన్నాఫ్ సునామి”, ”బాల తేజం”చిత్రాలు ఘనంగా ప్రారంభమైయ్యాయి. నటీనటులపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ క్లాప్ ఇచ్చి ప్రారంభించారు.

అనంతరం చీఫ్ గెస్ట్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. సన్నాఫ్ సునామి నటీనటులు బాగా నటించే వారే. ఈ సినిమా కాన్సెఫ్ట్ చాలా బాగుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సినిమా యూనిట్ కు మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా దర్శక నిర్మాతలకు మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ద్వారా పూర్తి సహాకారం అందిస్తాము. సినిమా రిలీజ్‌కు పూర్తి సహాకారం అందిస్తామని తెలిపారు.

హీరో దిలీప్ కుమార్ రాథోడ్ మాట్లాడుతూ.. ఎవరైన ప్రోడ్యూసర్ ఒక్క సినిమా అవకాశం ఇస్తారు. కానీ కృష్ణ ప్రసాద్ నాలుగు సినిమాల్లో చేసే అవకాశం ఇచ్చారు. వారి నమ్మకానికి ధ‌న్యవాదాలు. ”సన్నాఫ్ సునామి ” కథ చాలా బాగా నచ్చింది. ఈ సినిమా ద్వారా నాకే కాదు, నా తోటి నటీనటులకు మంచి పేరు వస్తుందని చెప్పుకొచ్చారు.హీరోయిన్స్ అరవింద అగర్వాల్, షణ్ణు మాట్లాడుతూ.. సన్నామి సునామి చిత్రంలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన కృష్ణ ప్రసాద్‌కి ధ‌న్యవాదాలు తెలిపారు.

Also Read:RT75:రవితేజ 75 ప్రారంభం

- Advertisement -