గ్రీన్ ఛాలెంజ్ పాల్గొన్న హరి రామ్ దంపతులు..

43

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు తమ పెళ్లి రోజును పురస్కరించుకుని హైదరాబాద్ లోని తమ నివాసంలో మొక్కలు నాటారు ఇంజనీర్ ఇన్ చీఫ్ (ENC) హరీ రామ్, అనిత (Dy ENC) దంపతులు. వాతావరణ కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోందని దాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే చాలా అద్భుతమైన కార్యక్రమం చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తున్నారని వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.