మొక్కలు నాటిన సినీ ఆర్టిస్ట్ సుమిత్ర పంపాన

678
green challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆర్టిస్ట్ ప్రీతి నిఘం ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈరోజు కోట్ల విజయ్ భాస్కర్ స్టేడియం లో మొక్కలు నాటారు సినీ ఆర్టిస్ట్ సుమిత్ర పంపాన.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడం చాలా ముఖ్యమని భవిష్యత్ తరాల కోసం మనమందరం బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. అందరు కూడా ఏదో ఒక్క రకంగా మొక్కలు పెంచడం కోసం బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఛాలెంజ్ ఇదేవిధంగా కొనసాగాలని అందుకోసం నేను మరొక ముగ్గురిని సినీ ఆర్టిస్ట్. వినోద్ బాల గారు.చక్ర వర్తి గారు. గోపాల్ రావు గారు . వీళ్లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -