‘మా’ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

32

హైదరాబాద్ మాదాపూర్‌లోని మెడిక‌వ‌ర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ‘మా’ సభ్యులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం నుండి దాదాపు రెండు వందల మంది ‘మా’ అసోషియషన్ సభ్యులు హైల్త్ చేకప్ చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ‘మా’ అసోషియషన్ అధ్యక్షులు మంచు విష్ణు పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. మా మూవీ అసోషియషన్ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హైల్త్ చేకప్‌లో పది రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. మా మూవీ అసోషియషన్ అండగా ఉండి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మెడిక‌వ‌ర్ హాస్పిటల్ వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మా అసోషియషన్ సభ్యులు రఘుబాబు,శివ బాలాజీ, మెడికవర్ యండి అనిల్ కృష్ణ, డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.