ఫ్యాన్సీ రేటుకు ‘సుబ్రహ్మణ్యపురం’

287
- Advertisement -

నిర్మాణంలో వుండగానే అందరి దృష్టిని ఆకర్షిస్తూ.. అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తున్న హీరో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సుబ్రహ్మణ్యపురం. ఓవర్సీస్ హక్కులు ఫ్యాన్సీ రేటుతో కంట్రీసైడ్ పిక్చర్స్ అధినేతలు దక్కించుకున్నారు. ఇప్పటి వరకు సుమంత్ కెరీర్‌లో ఓవర్సీస్ హక్కులకు లభించని ఫ్యాన్సీ అమౌంట్ ఈ చిత్రానికి దక్కడం విశేషం. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రవైట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

subramaniapuram movie ఈషా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ఈ సందర్భంగా నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సూపర్ నాచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్ ఈ చిత్రంలో తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకులకు కలిగిస్తుంది. అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ముప్పె నిమిషాల పాటు వుండే వీఎఫ్‌ఎక్ట్స్ గ్రాఫిక్స్ ప్రేక్షకులకు థ్రిల్ల్‌ను కలిగిస్తాయి. తెలుగులో బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన బాహుబలి, గరుడవేగ, రంగస్థలం చిత్రాలకు పనిచేసిన వీఎఫ్‌ఎక్ట్స్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తుండటం విశేషం. సుమంత్ కెరీర్‌లో ఇప్పటి వరకు ఎన్నాడు లేని విధంగా ఫ్యాన్సీ రేటుకు ఓవర్సీస్ హక్కులు అమ్ముడుపోయాయి. తప్పకుండా చిత్రం తప్పకుండా అందర్నీ అలరిస్తుందనే నమ్మకం వుంది అని తెలిపారు.

sumanth సుమంత్, ఇషారెబ్బ,తనికెళ్ల భరణి, సాయికుమార్, అలీ, సురేష్, జోష్ రవి, భద్రమ్ గిరి, మాధవి, హర్షిణి, టీఎన్‌ఆర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.కె. ప్రతాప్, సంగీతం: శేఖర్‌చంద్ర, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, కళా దర్శకత్వం: లక్ష్మీసింధూజ గ్రంధి, ప్రాజెక్ట్ డిజైనర్: కృష్ణ చిత్తనూర్, ైస్టెలింగ్: సుష్మ త్రిపురాన, ప్రొడక్షన్ కంట్రోలర్:సలాన బాలగోపాలరావు, మూలకథ: వెంకట శ్రీనివాస్ బొగ్గరం, రచనా సహకారం: నాగమురళీధర్ నామాల, నిర్మాత: బీరం సుధాకర్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి.

- Advertisement -