ఎంగేజ్‌మెంట్‌ పార్టీలో ప్రియాంక స్టెప్పులు..

286
Priyanka Chopra Dances Crazily At Her Engagement
- Advertisement -

బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా ఇప్పుడు ఫుల్‌ జోష్‌ లో ఉంది. అంతేకాదు ఆనందంతో స్టెప్పులు కూడా వేసింది. ప్రియాంక డాన్స్‌ చేసిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లుకొట్టేస్తోంది. ఇంతకీ ప్రియాంక డాన్స్ చెయ్యడానికి కారణం తనకీ, నిక్ జొనాస్ తో ఎంగేజ్‌మెంట్‌ జరగడమే.

శనివారం ముంబయితో ఘనంగా ప్రియాంక చోప్రా, నిక్‌ జొనాస్ ల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ క్రమంలోనే ఈ ఉదయం ప్రియాంక ఇంటిలో పూజ నిర్వహించారు. పూజలో పాల్గొన్న ప్రియాంక, తనకు కాబోయే భర్త నిక్ లు రాత్రి అతిథులక, కుటుంబసభ్యులకోసం హోటల్లో పార్టీ ఏర్పాట్లు చేశారు.

 Priyanka Chopra Dancesప్రముఖులు ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ, ఈషా అంబానీ, సంజయ్‌ లీలా భన్సాలీ, విశాల్‌ భరద్వాజ్‌, ఆయుష్‌ శర్మ, అలియా భట్‌, అర్పితా ఖాన్‌, పరిణీతి చోప్రా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబోయే దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు.

కాగా..పార్టీ ఆనందంలో ప్రియాంక తెగ చిందులేసేసింది. అయితే ప్రియాంక చేస్తున్న డాన్స్ వీడియో తీశాడు నిక్‌. ఇదే సందర్బంగా నిక్‌తో కలిసి దిగిన పోటోను ప్రియాంక సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ‘నేను ఆయన సొంతం’ అని నిక్‌ మీద తనకున్న ప్రేమని పోస్ట్‌ ద్వారా తెలిపింది. ఇక ప్రియాంక పోస్ట్‌ కి నిక్‌ కూడా రిప్లై ఇస్తూ..‘ఈ అబ్బాయి చాలా అదృష్టవంతుడు’ అని అన్నాడు. ఆయన‌ కూడా ప్రియాంకతో ఉన్న ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘కాబోయే మిసెస్‌‌ నిక్‌.. నా హృదయం, నా ప్రేమ’ అని రాశారు. అక్టోబరులో లాస్‌ ఏంజెల్స్ వీరి వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం.‌ ఇదిలాఉంటే..ప్రియాంక కు కాబోయే భర్త నిక్‌ జొనాస్‌ ప్రియాంక కంటే వయసులో దాదాపు పదేళ్లు చిన్నవాడు కావడం గమనార్హం.

https://www.instagram.com/p/BmqJT1RHdlT/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

- Advertisement -