డిసెంబర్ 14న సుమంత్… ‘ఇదం జగత్‌’

222
idam jagath
- Advertisement -

సుమంత్ హీరోగా విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇదం జగత్’. సమంత్‌ సరసన అంజు కురియన్ హీరోయిన్‌గా నటిస్తుండగా విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. డిసెంబర్ 14న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తుండగా…. సుమంత్ కెరీర్‌లో ఇప్పటి వరకు చేయనటువంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కించిన టీజర్‌లో మేము ఒరిజినల్ న్యూస్ ఇస్తామంటూ – సమాజాన్ని బాగు చేస్తామంటూ స్లోగన్లు ఇచ్చిమరీ సమాజాన్ని అథోగతి పాలుచేసే ఫేక్ న్యూస్ ఇచ్చే జర్నలిజం పైన ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ మూవీలో శివాజీరాజా, ఛలో ఫేమ్ సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్య మీనన్ లు కీలక పాత్రలు పోషించారు.

- Advertisement -