హ్యాపీ బర్త్ డే…సుమన్ శెట్టి

92
- Advertisement -

టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ సుమన్ శెట్టి. దర్శకుడు తేజ తెరకెక్కించిన జయంతో సినిమాతో వెండితెరకు పరిచయమైన సుమన్…తర్వాత తెలుగు, తమిళ భాషల్లో కలిపి వందకు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. చివరగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో కనింపిచన ఆయన బర్త్ డే నేడు.

సుమన్ శెట్టి స్వస్థలం నల్గొండ జిల్లా, మిర్యాలగూడ. సినీ రచయిత సత్యానంద్ అతనిలోని నటుడిని గుర్తించి సినిమాలలో ప్రయత్నించమన్నాడు. తేజతో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన సుమన్… అంచెలుంలుగా ఎదిగారు. తన మాట,నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.

Also Read:హ్యాపీ బర్త్ డే… అజిత్

చాలా సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసాడు సుమన్ శెట్టి. ముఖ్యంగా బృందావన కాలనీలో మనోడి కామెడీకి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత నిజం, ధైర్యం లాంటి సినిమాల్లో కూడా అదిరిపోయే కామెడీ చేసాడు సుమన్. దాదాపు పదేళ్ల పాటు ఇండస్ట్రీలో మెప్పించిన సుమన్ ప్రస్తుతం విశాఖపట్నంలో నివాసం ఉంటున్నారు.

Also Read:May Day:కార్మిక దినోత్సవం

- Advertisement -