ఆ భూమి జవాన్లకే..స్పష్టంచేసిన సుమన్..!

171
suman

టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న హీరో సుమన్‌. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలక్రిష్ణ, నాగార్జున లాంటి హీరోలను ధీటుగా ఎదుర్కొని తన యాక్షన్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించారు. మార్షల్ ఆర్ట్స్ హీరోగా సుమన్ చేసిన యాక్షన్ సినిమాలు టాలీవుడ్‌లో మరే హీరో చేయలేకపోయారు. అంతేగాదు తాను రీల్ హీరోను మాత్రమే కాదు రియల్ హీరో అనిపించుకునేలా తాను సంపాదించిన ఆస్తిలో 175 ఎకరాలు జవాన్లకు ఇచ్చేశారు. త్వరలో వందో సినిమా చేస్తుండటంతో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు సుమన్‌.

తాను సంపాదించిన ఆస్తిలో 175 ఎకరాలు సైనికుల కోసం ఇవ్వడం బాధ్యతగా భావించా. అందుకే దేశాన్ని రక్షించే సైనికులకు 175 ఎకరాలను ఇచ్చేశానని తెలిపారు. కార్గిల్ యుద్ధం సమయంలో కొంతమంది డబ్బులు ఇస్తే తాను భూమిని డొనేట్ చేశానని తెలిపారు. అయితే ఆ భూమిపై కేసు నడుస్తోంది. అయితే అందులో ఎంత భూమి వచ్చినా దాన్ని సైనికులకే ఇచ్చేస్తానని చెప్పారు.

తాను యాక్షన్ సినిమాలు చేయడానికి ఇప్పటికీ రెడీగానే ఉన్నాను. కాని కష్టాలతో ఉన్నాను సినిమా తీయండి అంటే ఎవరూ ముందుకు రారు. కష్టాల్లో ఉన్నప్పుడు సినిమా తీయకూడదని చెప్పారు. 99 సినిమాలు చేశా.. వందో సినిమా అయ్యప్ప సినిమా చేస్తున్నానంటే ఆయన బ్లెస్సింగ్‌గా భావిస్తున్నానని చెప్పారు.