మహేష్‌తో విభేదాలపై ప్రకాష్ రాజ్..!

183
prakashraj

ప్రిన్స్ మహేష్‌ బాబుతో ఉన్న విభేదాలపై స్పందించారు ప్రకాష్ రాజ్‌. భరత్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్ ఫ్యాన్స్ వల్ల అలిగిన ప్రకాష్ రాజ్…తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించారు కానీ ప్రీ రిలీజ్‌… ప్రమోషన్స్‌లో కాని పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో ఇష్యూపై స్పందించారు ప్రకాష్ రాజ్‌.

మహేష్ బాబుతో తనకు ఎలాంటి గ్యాప్ లేదని…గ్యాప్ ఉంటే సరిలేరు నీకెవ్వరు చిత్రం ఎలా చేస్తానని ప్రశ్నించారు. తాను సినిమా ఫంక్షన్లకు దూరంగా ఉంటానని…సినిమా చేశానా? అయిపోయిందా? అంతవరకే అన్నారు.

నా సినిమాలు నేను చూడను. అంతెందుకు సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా నేను చూడలేదు. అలాంటప్పుడు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లకు ఎందుకు వెళ్తా. ఆ టైంలో ఫ్యామిలీతోనే.. మిగతా సినిమా షూటింగ్‌లకో వెళ్తుంటానని చెప్పారు.