విభిన్నకథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే డైరెక్టర్ సుకుమార్, తాజాగా ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేసిన రంగస్థలం చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ చిత్రంలో పూజా హెగ్దే చేసిన జిగేలు రాణి ఐటమ్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్శిస్తుంది. సుకుమార్ సినిమా అంటేనే ప్రేక్షకులు ఐటమ్ సాంగ్ ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఆయన చేసే ప్రతీ సినిమాలో ఐటమ్ సాంగ్ ని ప్రత్యేకించి రూపొందిస్తారు. ఆర్య నుంచి మొదలైన సుకుమార్ ఐటమ్ సాంగ్స్ ప్రయాణం, ఆర్య-2, నేనొక్కడినే, రంగస్థలం.. ప్రతి సినిమాలో ఐటమ్ సాంగ్స్ తో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు.
ఆర్య సినిమాలో అ అంటే అమలాపురం పాట ఎంత హిట్టో చెప్పక్కర్లేదు. తన సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ ఎందుకంత హిట్ అవుతున్నాయన్న విషయాన్ని సుకుమార్ బయటపెట్టాడు. తాను. తాను పల్లెటూరిలో రికార్డింగ్ డ్యాన్యులు చూస్తూ పెరిగానని పేర్కొన్నారు. ఊళ్లలో చిన్నప్పటి నుంచి పాటలను బూతులతో పాడుకోవడం తనకు అలవాటని చెప్పుకొచ్చారు. జానపదాలను కూడా తిట్టుకుంటూ పాడుకుంటుంటే సమాజం భాషలో కలిసిపోయేదని చెప్పాడు. అదే భాష నగర వాసులకు వచ్చే సరికి భూతు అవుతుందన్నారు. అలా ఇక్కడ మాట్లాడితే తప్పుపడతారన్నారు సుక్కు.
ఆర్య సినిమాలో అ అంటే అమలాపురం పాట ఎంత హిట్టో చెప్పక్కర్లేదు. ఆ చిత్రంలో ఆ పాట హిట్ కావడంతో తన ఆ సెంటిమెంట్ కొనసాగిస్తున్నన్నారు. ఆర్య-2 లో రింగ.. రింగ, రంగస్థలంలో జిగేల్ రాణి వంటి పాటలు వచ్చాయని పేర్కొన్నారు. అభిమానులు కోరుకుంటున్నారు కాబట్టే ఆ సెంటిమెంట్ కొనసాగిస్తున్నా అని సుకుమార్ తెలియజేశారు.