సాహోలో సల్మాన్‌ పాత్రపై క్లారిటీ వచ్చేసింది…!

325
salman khan prabhas
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సాహో. ఆగస్టు 15న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 300 కోట్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా సినిమాకి మరింత హైప్ తీసుకుని రావడానికి ఇందులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ఓ కీలక రోల్ చేయించారని గత కొన్ని రోజులు నుండి వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో సల్మాన్‌ పాత్రపై క్లారిటీ ఇచ్చేశారు సుజీత్. సినిమా షూటింగ్ పూర్తైందని అతిథి పాత్ర కోసం సల్మాన్‌ను సంప్రదిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. బాలీవుడ్ నటులు అరుణ్ విజయ్,ఎవిలిన్ శర్మ,జాకీ ష్రాఫ్,మందిరా బేడి,చుంకి పాండే,మహేష్ మంజ్రేకర్,ఆదిత్య శ్రీవాస్తవ నటిస్తున్నారని చెప్పారు. దీంతో కొన్ని రోజులు నుండి సాహోలో సల్మాన్ అంటూ వైరల్ అవుతున్న రూమర్స్‌కి చెక్ పడినట్లైంది.

తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుండగా ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సీన్స్ కోసమే 90 కోట్ల వరకూ ఖర్చు చేశారట. యాక్షన్ సీన్స్‌ కోసం ప్రభాస్ తీవ్రంగా శ్రమించాడని చిత్రయూనిట్ తెలిపింది.

- Advertisement -