సీఎం కేసీఆర్‌ని కలిసిన ఎంపీలు నామా,కవిత

506
nama

ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు,మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత …సీఎం కేసీఆర్‌ని కలిశారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో అపూర్వ విజయం సొంతం చేసుకున్న వీరిద్దరూ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల ఆకాంక్షలను అనుగణంగా పనిచేయాలని సీఎం వారికి సూచించారు.

ఖమ్మం జిల్లాకు చెందిన నామా రెండోసారి ఎంపీగా గెలుపొందారు. 2009లో టీడీపీ నుండి ఎంపీగా పోటీచేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్ధి రేణుకా చౌదరిపై గెలుపొందారు. తర్వాత పోటీచేసినా ఆయనకు విజయం వరించలేదు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌లో చేరిన ఆయన మరోసారి రేణుకా చౌదరిపై భారీ మెజార్టీతో విజయబావుటా ఎగురవేశారు. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీకన్నా ఈసారి అత్యధికంగా రావడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

kcr kavitha

మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాలోత్‌ కవిత 1,46,663 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవితకు 4,62,109 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌కు 3,15,446 ఓట్లు వచ్చాయి.