సుజాత సర్‌ప్రైజ్‌తో హౌస్‌ మేట్స్ దిల్ ఖుష్‌!

53
sujatha

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 105 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. దాదాపు 4వ సీజన్ ముగియగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ ఫినాలే ప్రారంభంకానుంది. ఇక 105వ ఎపిసోడ్‌లో భాగంగా మెహబూబ్,దివి,నోయల్,అవినాష్,గంగవ్వ,సుజాత ఇంటి సభ్యులతో కలిసి సందడి చేశారు.

తొలుత అఖిలు..ఓ అఖిలూ అని గంగవ్వ ఆప్యాయంగా పిలవగా ఆమెను చూడగానే తెగ సంబరపడిపోయారు అఖిల్. త‌ర్వాత‌ జోర్దార్ సుజాత లోనికి రాగా అవ్వ‌తో క‌లిసి ఫైన‌లిస్టుల‌తో ఆటాడించారు. తనను ఇంప్రెస్ చెస్తే మంచి మెస్సేజ్ ఇస్తానని తెలపగా అభిజిత్-సొహైల్ పోటీ పడ్డారు.

అభి మైకు విర‌గొట్టుకుని మ‌రీ మొద‌ట‌గా కాఫీ మ‌గ్గు తీసుకొచ్చాడు. త‌ర్వాత సోహైల్ ప్లేటు మీద ఐ ల‌వ్ యూ అని రాసుకొచ్చి మ‌రీ అందించాడు. ఇలా ఎవ‌రికి తోచిన ప్ర‌య‌త్నాలు వారు చేయ‌గా ఇంప్రెస్ అయిన సుజాత…..ఇంట్లో ఉన్న వారి కుటుంబసభ్యులు,స్నేహితులు మాట్లాడిన వీడియోలు చూపించి జోష్ నింపారు.

మెహ‌బూబ్‌ను చూడ‌గానే సోహైల్ తెగ ఎగ్జైట్ అయ్యాడు. ఇక దివిని చూసిన అఖిల్ … దీపిక పదుకొణెలా ఉన్నావంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు. చాలా బాగున్నావంటూ అభిజిత్ కూడా మెచ్చుకోవ‌డంతో ఏంటి పులిహోరా? అని సరదాగా నవ్వించే ప్రయత్నం చేసింది.