వైకుంఠ ఏకాదశి..స్ధానికులకే పెద్దపీట: టీటీడీ

41
ttd

ఈ నెల 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చని తెలిపారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. సర్వదర్శనం టోకెన్లు ఈ సారి స్ధానికులకే ఇవ్వాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించిందన్నారు.

కౌంటర్ల వద్ద తోపులాట లేకుండా, స్థానికులనే అనుమతించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ రోజుకు 30 నుంచి 35 వేల మందిని దర్శనానికి అనుమతిస్తాం అన్నారు. ఆఫ్ లైన్ టికెట్ల కోసం స్ధానికేతరులు రావద్దని విజ్ఞప్తి చేశారు.

కోవిడ్ వ్యాపికి అవకాశం, పెరటాసి మాసం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలు, శాంతిభద్రతల ఇబ్బందుల దృష్ట్యా సర్వదర్శనం టోకెన్లు స్థానికులకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం’ అని ఆయన వెల్లడించారు. రోజుకు 20 వేల చొప్పున శీఘ్ర దర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో ఉంచామని చెప్పారు.