సుధీర్‌బాబు హీరోగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఈ సినిమాలో నాయికగా నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 10గా ఈ సినిమాను నిర్మిస్తోంది.
నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ “డిసెంబర్ 11 నుంచి 23 వరకు హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్ చేశాం. హీరో ఇంటికి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించాం. ఆర్ట్ డైరక్టర్ రవీందర్ రూపుదిద్దిన హీరో హౌస్ సెట్ చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఈ సన్నివేశాల్లో ఆ సెట్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. అవుట్ ఫుట్ చాలా సంతృప్తి కరంగా వస్తోంది . జనవరి 1 నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం. అది కూడా భాగ్యనగరంలోనే ఉంటుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. సంక్రాంతి తర్వాత టైటిల్ ప్రకటిస్తాం.మే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం “ అని అన్నారు.
దర్శకుడు మోహన్‌కృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ “రొమాన్స్, హాస్యం సమ్మిళితమైన కథ ఇది. ఈ సినిమాలో హీరో చిల్డ్రన్ బుక్స్ ఇల్లస్ట్రేటర్‌గా నటిస్తున్నారు. అనూహ్యమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా నడిచే ఒక కొత్త తరం ప్రేమకథా చిత్రమిది. పి.జి.విందా ఫొటోగ్రఫీ హైలైట్ అవుతుంది“ అని చెప్పారు.
సుధీర్‌బాబు, అదితిరావు హైదరి, నరేశ్, తనికెళ్ల భరణి, నందు, రాహుల్ రామకృష్ణ, పవిత్ర లోకేష్ ,కాదంబరి కిరణ్, హరితేజ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు మేకప్: పి.బాబు, కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్. మనోజ్ కుమార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: పి. రషీద్ అహ్మద్ ఖాన్, కె. రామాంజనేయులు, కో డైరక్టర్: కోట సురేశ్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: యస్ . రవీందర్, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేశ్; డైరక్టర్ ఆఫ్ పొటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన- దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.