హీరోకు తెలియకుండా సినిమా రిలీజ్..!

240
Sundeep Kishan Files Police Complaint
- Advertisement -

ఫిలిమ్‌ ఇండస్ట్రీలో జరిగే కొన్ని సంఘటనలు వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు అంత ఆశ్చర్యపడే విషయం అంటనేగా మీ సందేహం. ఇక అసలు విషయానికొస్తే.. సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘ప్రాజెక్ట్ జెడ్’ అనే సినిమా ఈ శుక్రవారం రిలీజ్‌ అయింది. అయితే పెద్దగా ప్రమోషన్ చేయకపోవటం కారణంగా ఈ సినిమా రిలీజ్ అయిన విషయం కూడా అధిక శాతం ప్రేక్షకులకు తెలియలేదు. అందుకే చాలా తక్కువ కాలెక్షన్‌ చేసిందట ఈ సినిమా.

Sundeep Kishan Files Police Complaint

తమిళ్ లో బాగానే ఆడిన ‘మాయవన్’ కి ఇది డబ్బింగ్ వెర్షన్. దీని గురించే సందీప్ కిషన్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. తనకు నిర్మాతకు తెలియకుండా అనధికార ప్రింట్‌ను శుక్రవారం థియేటర్స్‌లో వేసారని – ఇందులో తన వాయిస్ కూడా డబ్ కాలేదని – వేరే ఎవరిదో ఉందని ఆరోపిస్తూ అసలు విడుదలకు తాము క్లియరెన్స్ ఇవ్వలేదని కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. ఒక అభిమాని సందీప్ కిషన్ కి సినిమా బాగుంది అని ట్వీట్ చేసే దాకా ఈ విషయమే తెలియలేదట.

ఇల్లీగ‌ల్ స్క్రీనింగ్ జ‌ర‌గడానికి కార‌ణ‌మైన వారిని శిక్షించాల‌ని పోలీస్ కేసు కూడా పెట్టార‌ట‌. త‌మిళంలో మంచి టాక్ తెచ్చుకున్న మాయావ‌న్ చిత్రాన్ని సీవి కుమార్ తెర‌కెక్కించ‌గా, గిబ్రాన్ సంగీతం అందించాడు.ఈ మూవీలో లావణ్య త్రిపాటి హీరోయిన్‌గా నటించింది.

- Advertisement -